టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం హరిహరవీరమల్లు టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం హరిహరవీరమల్ల. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా వస్తుంది. హరిహరవీరమల్లు పార్ట్ 1 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఇప్పటికే మాట వినాలి బీటీఎస్ వీడియో రిలీజ్ చేయగా నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై హైప్ పెంచేస్తుంది. తాజాగా మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.
ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌లో పవన్ కల్యాణ్ తో పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్ డ్యాన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అనసూయ ఓ టీవీ రియాలిటీ షోలో చెప్పేసింది. అంతేకాదు ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు అదిరిపోయే పాటలు కంపోజ్ చేసిన గణేశ్ మాస్టర్ మరోసారి ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేయబోతున్నాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందని సమాచారం. మొత్తానికి జ్యోతికృష్ణ ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయేలా ప్లాన్ చేశాడని అర్థమవుతుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.