14లక్షల మందికి ప్రయోజనం, రెండు లక్షల్లోపు అప్పు మాఫీ..

ravanth-14.jpg

మూడో విడత రుణమాఫీ రేపు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈ క్రమంలో అన్నదాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా. కాగా విదేశాల నుంచి రేవంత్ ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంటారు. రేపు గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌ల వైరాకు పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు. రుణమాఫీకి అర్హమైన ఖాతాలు మొత్తంగా 32.50 లక్షలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు సర్కారు బడ్జెట్‌లో నిధులను కేటాయించింది.

Share this post

scroll to top