మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పింది అక్షరసత్యం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టమని అంటున్నారు, పైసలు కూడా ఇస్తామన్నారని చెప్పారు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన మాకు లేదని వెల్లడించారు కేటీఆర్. రీ-ట్వీట్ చేసినా కేసులు పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మందిని ఎవరిని వదిలి ప్రసక్తే లేదు. మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాము అని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. రేవంత్ రెడ్డి HCU భూములపై చేసిన కుంభకోణంపై మోడీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని HCU భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నాడని మోడీ హర్యానాలో మాట్లాడాడు అని ఆగ్రహించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్..
