టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హైదరాబాద్ ట్రాపిక్ లో హల్ చల్ సృష్టించాడు. రాంగ్ రూట్ లో కారు డ్రైవ్ చేస్తూ రూల్స్ బ్రేక్ చేశాడు. ఇవాళ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద బెల్లంకొండ శ్రీనివాస్ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ రాంగ్ రూట్లో దూసుకువచ్చారు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుని రాంగ్ రూట్ లో రావడం ఏంటని నిలదీశాడు. దీంతో అతడు అక్కడి నుంచి ఆయన వెనక్కి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రెటీలు ఇలా నిబంధనలు ఉల్లంఘించడం ఏంటని ఈ వీడియోను చూసిన నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
కారుతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పైకి దూసుకొచ్చిన టాలీవుడ్ హీరో..
