తీవ్ర విషాదంలో టాలీవుడ్.. 

actor-20.jpg

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్నది. గుండె పోటుతో ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. వారం క్రితం హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయనకు గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రితో చేర్పించారు. అయితే మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు రాజ్ కుమార్ ను చెన్నై తరలించారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితి విషమించడంతో చెన్నై ఆసుపత్రిలోనే రాజ్ కుమార్ తుది శ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన ఆయన మరణించడంతో టాలీవుడ్ లో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా విలన్ వేషాలకు విజయ రంగరాజుకు పెట్టింది పేరు. నందమూరి బాలకృష్ణ నటించిన భైరవద్వీపం సినిమాతో ఫేమస్ అయ్యారు. అలాగే యజ్ఞం, సీమశాస్తి, జాంబిరెడ్డి, ఢమరుకం, విశాఖ ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాల్లో విజయ రంగరాజు నటించారు.

Share this post

scroll to top