క్యూలో దర్శకులు.. తదుపరి ఎవరితో

aaa-16.jpg

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్  ప్రస్తుతం  ‘పుష్ప2తో బిజీగా ఉన్నారు. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో అంతకుమించి ఉండేలా ఈ చిత్రం కోసం సుకుమార్‌ అండ్‌ కో కష్టపడుతోంది. ఈ చిత్రం చేస్తూనే బన్నీ తదుపరి చిత్రాల మీద దృష్టి పెట్టారని తెలుస్తోంది. సందీప్‌రెడ్డి వంగా, అట్లీ, త్రివిక్రమ్‌.. ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఏది ఎప్పుడు సెట్‌ మీదకె వెళ్తుందనేది తెలీదు. ఓ వైపు ‘పుష్ప-2’ షూటింగ్‌ సాగదీతగా సాగుతూనే ఉంది. దాంతో బన్నీ తదుపరి చిత్రం ఏముంటుంది అనే దానిపై స్పష్టత లేదు. ఆయన మాత్రం కథల చర్చలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ తర్వాత అందుకు దీటైన కథల్నే ఎంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఇటీవలే మరో దర్శకుడు కలిసి అల్లు అర్జున్‌కి కథ వినిపించినట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు  ‘జైలర్‌’ సినిమా ఫేం నెల్సన్‌. మరి ఈ కలయికలో సినిమా ఉంటుందా? అది ‘పుష్ప 2’ తర్వాతే ఉండొచ్చా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా బన్నీ కోసం పురాణాలతో ముడిపడిన కథ తయారు చేసినట్టు టాక్‌ నడుస్తోంది. బడ్జెట్‌, పారితోషికం కారణాలతో అట్లీతో సినిమా ఆగిపోయిందని టాలీవుడ్‌ టాక్‌.  మరి అల్లు అర్జున్‌ ఎవరి కథవైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Share this post

scroll to top