వారసులపై టాలీవుడ్‌ చూపు..

sons-03.jpg

ఫారిన్‌లో చదువుకుంటున్న మహేష్‌ వారసుడు గౌతమ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నారు. దానికి కారణం ఆయన నటించిన షార్ట్ ఫిల్మ్. ఇండియన్‌ అబ్బాయి పాకిస్తాన్‌ అమ్మాయి మధ్య జరిగే షార్ట్ ఫిల్మ్ కావడంతో ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది. అవకాశం వచ్చిన ప్రతిసారీ గౌతమ్‌ సినిమా ఎంట్రీ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. ఇంకా టైమ్‌ ఉందని అంటున్నారు పేరెంట్స్. బట్‌, ఇలాంటివి రిలీజ్‌ అయినప్పుడు మాత్రం ఎప్పుడో సడన్‌గా ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి.

అకీరా నందన్ ఎంట్రీపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అకీరాకు సినిమా ఎంట్రీ ఇష్టం లేదనే మాటలు వినిపిస్తున్నా, సేనాని తనయుడు సినీ ఎంట్రీ కోసం మాత్రం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు జన సైనికులు. మరోవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ అందుకున్న సమయంలో మోక్షజ్ఞ పిక్స్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాదైనా ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టమని రిక్వెస్టులు పంపుతున్నారు. అయితే మోక్షజ్ఞ డెబ్యూ మూవీగా ఆదిత్య 369 సీక్వెల్ వస్తుందా.? లేదా మరింకేదైన సినిమా వస్తుందా.? అనేది ఇంకా సస్పెన్స్ మాత్రం నడుస్తుంది.

Share this post

scroll to top