నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

murmu-22.jpg

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజూ పర్యటన నగరంలో కొనసాగుతోంది. గురువారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమె అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లి అక్కడ భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం వేడుకలో పాల్గొన్నారు. అనంతరం రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం 10.20 గంటలకు హైటెక్ సిటీ సమీపంలోని శిల్పకళావేదికలో జరుగుతున్న లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నేడు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.రాజ్ భవన్ నుంచి తాజ్ కృష్ణ రోడ్ వరకూ ఆంక్షలు కొనసాగననున్నాయి.సాగర్ సొసైటీ, జూబ్లీహిల్స్, కేబుల్ బ్రిడ్జి పంజాగుట్ట, బేగంపేట ఎయిర్ పోర్టు వరకూ ఆంక్షలను విధించారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Share this post

scroll to top