తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్స్ ను వాలంటీర్స్ గా ఉపయోగించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి అధికారులతో చర్చించినట్లు సమాచారం. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై ఉన్నాతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హూం గార్డు తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
రేవంత్ వినూత్న ఆలోచన..
