2 లక్షల వరకు రుణమాఫీ..

runamafi-03.jpg

రైతు, రైతు అనుబంధ రంగాలు బాగుపడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షాలు అడ్డుకుంటున్న ఆటంకాలు కల్పిస్తున్న ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రంలో రైతులకు సంబంధించిన 31 వేల కోట్ల రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు. ఇప్పటికే 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేసినట్లు మరో 13 వేల కోట్ల రుణాలను మాఫీ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

Share this post

scroll to top