తండ్రిని స్క్రీన్ పై చూసి మురిసిపోతున్న క్లీంకార..

ram-04.jpg

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఆస్కార్ విన్నింగ్ చిత్రం ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా మేకింగ్‌కి సంబంధించి రీసెంట్‌గా డాక్యుమెంట‌రీ రూపంలో తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్: బిహైండ్ & బియాండ్ అంటూ ఈ డాక్యుమెంట‌రీ రాగా ప్ర‌స్తుతం ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ డాక్యుమెంట‌రీని చూస్తున్న ఉపాస‌న అందులో రామ్ చ‌ర‌ణ్ రావ‌డంతో అక్క‌డే ఉన్న క్లీంకార‌ను ఎవ‌రని అడుగుతుంది. తొలిసారి నాన్నని టీవీలో చూడ‌డంతో ఎగ్జైట్ అయ్యింది క్లీంకార‌. రామ్ చరణ్ నీ గురించి చాలా గర్వంగా ఉంది. గేమ్ చేంజ‌ర్ కోసం క్లీంకార‌తో పాటు మేము ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ ఉపాస‌న రాసుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Share this post

scroll to top