బ్రతిమిలాడినా వినకుండా నా చీర లాగేసి నన్ను కొట్టారు అంటూ బాధితురాలు శిరీష ఎమోషనల్ అయ్యారు. అప్పు తీర్చేందుకు సమయం ఇవ్వమని వేడుకున్నా వినలేదన్నారు. మా అమ్మని కొట్టొద్దు అని పిల్లవాడు ఏడుస్తుంటే వాడిని రోడ్డు మీదకి ఈడ్చేశారని పేర్కొన్నారు. 80 వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి టీడీపీ కార్యకర్త కొట్టారని వెల్లడించారు. పిల్లాడి టీసీ చింపడానికి ప్రయత్నిస్తుంటే ఆపినందుకు నా చీర లాగేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి, దారుణంగా కొట్టి చంపేస్తామని బెదిరించారన్నారు బాధితురాలు శిరీష.
బ్రతిమిలాడినా వినకుండా నన్ను కొట్టారు..
