వాకింగ్‌లో అనేక పద్ధతులు ఉన్నాయి. అయితే, గులకరాళ్లపై కాళ్లకు చెప్పులు లేకుండా నడవటం వల్ల మనం ఊహించని లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గులక రాళ్లపై నడక వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో శరీరంలోని విషాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఇది సాధారణంగా వ్యాయామంలా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజువారీ గులకరాళ్ళతో నడవడం వల్ల వృద్ధులలో రక్తపోటు తగ్గుతుంది. గులకరాళ్లపై నడిస్తే బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గులకరాళ్లపై ఎలాంటి చెప్పులు, షూస్ లేకుండా నడవడం వల్ల పాదాల్లోని నాడీ ముద్రలను ఉత్తేజితం చేసి రక్త ప్రసరణను పెంచుతుంది. పాదాల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. రుమాటిక్ వ్యాధులను నివారిస్తుంది. ఇది ఒక విధంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి వైద్యంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, అందుబాటులో ఉన్నవారు ప్రతి రోజు 10 నిమిషాలు గులకరాళ్లపై నడవటం అలవాటు చేసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.