అనన్య పాండే తాజాగా ‘కంట్రోల్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అనన్య పాండే, విహాన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ నెట్‌ఫ్లిక్స్ చిత్రానికి విక్రమాదిత్య మొత్వానే దర్శకత్వం వహించగా ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం ప్రమోషన్స్ టైంలో అనన్య చేసిన కామెంట్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సంజయ్‌లీలా భన్సాలీ నాకు ఇష్టమైన డైరెక్టర్. ఆయన సినిమాల్లో చాన్స్ రావాలని కోరుకుంటున్న. కెరీర్ స్టార్టింగ్‌లో నుంచి ఇప్పటి వరకు ఎన్నో జానర్ సినిమాల్లో నటించాను. రొమాంటిక్ హారర్, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలని ఉంది. అలాగే కరణ్ జోహర్ సినిమాలో హీరోయిన్ గా నటించాలనేది నా కోరిక. ఆయన దర్శకత్వంలో వచ్చిన కాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీలో చిత్ర పాత్ర పోషించే అవకాశం వచ్చింది. కానీ, ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.