అసలు ఇది ఏం చేస్తుందో తెలుసా..

hidra-26.jpg

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ‘హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాల విషయంలో ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, నాలాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. రికార్డులు బయటికి తీస్తూ అసలు విషయాలను బట్టబయలు చేసే పనిలో పడింది. ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారాలతో అక్రమ నిర్మాణాలను బుల్డోజ్ చేసేస్తోంది. సామాన్యులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా ‘హైడ్రా’ కఠినంగా వ్యవహారిస్తోందనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. తాజాగా టాలీవుడ్ హీరో అఖినేని నాగార్జునకు చెందిన ఎన్  కన్వెన్షన్ ను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది.

అసలేంటీ ‘హైడ్రా..

హైడ్రా అంటే ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి ఇటీవలే ఏర్పాటైంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు విస్తరించి ఉంటుంది.

ఇప్పటి వరకు ఏం చేశారు..

ప్రభుత్వ లెక్కల ప్రకారం హైడ్రా ఇప్పటి వరకు 166 ఆక్రమ నిర్మాణాలపై చర్య తీసుకుంది. మొత్తం 43.54 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గాజులరామారంలోని చింతల్‌ చెరువు ఒడ్డున 54 నిర్మాణాలను కూల్చేశారు. గండిపేట్‌ చుట్టూ 24, ఖాన్‌పూర్‌లో 14, చిల్కూర్‌ ప్రాంతంలో 10 నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు.

Share this post

scroll to top