శరీరం అనేది వివిధ పోషకాలు, ఖనిజాల నుంచి శక్తిని పొందే వ్యవస్థ. ఒకవేళ ఏదైనా ముఖ్యమైన మూలకం లేదా అధికంగా ఉన్నా, తక్కువగా ఉన్నా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళల్లో సోడియం లెవల్స్ తగ్గడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అటువంటి ముఖ్యమైన పోషకాలలో ఒకటి సోడియం లేదా ఉప్పు. శరీరం బాగా పనిచేయడానికి కొంత మొత్తంలో సోడియం అవసరం. ఇది ప్రసరణ వ్యవస్థలో అంతర్భాగం. సోడియం రక్త నాళాల నుంచి కణాలకు పోషకాలు , ఖనిజాలను తరలించడంలో సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన సోడియం చాలా వరకు మనం రోజూ తినే ఉప్పు ద్వారానే లభిస్తుంది. శరీరంలో ఉప్పు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువ అయినా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో ఉప్పు తక్కువగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..? రోజుకు ఎంత ఉప్పు అవసరమో తెలుసా..? శరీరంలో ఉప్పు లోపిస్తే ఎలా గుర్తించవచ్చు.
శరీరంలో సోడియం లెవల్స్ తగ్గితే ఏమౌతుంది..
