ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపు 17 మాసాలుగా జైల్లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే కేసులో ఈ ఏడాది మార్చి నుంచి జైల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవితకు కూడా ఊరట లభించనుందా? అనే చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే సిసోడియా కేసును సాగదీయాలన్న ఉద్దేశం కనిపిస్తోందని సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు చురకలు అంటించింది.
కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో చిట్ చాట్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందన్నారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసన్నారు. నాతోసహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ తో జరగబోయేది యుద్దమే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తామన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్ అని తెలిపారు.