Tag Archives: Revanth Reddy

రేపటి నుంచి రేవంత్ జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఇదిగో!

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రేపటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. కేరళ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సాయంత్రం ఆయన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. రేపు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడతారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ...

Read More »

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారన్న ఆర్కే

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. చంద్రబాబు పేరును చార్జ్ షీట్ లో తెలంగాణ ఏసీబీ 22 సార్లు ప్రస్తావించిందని… అయినప్పటికీ చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చలేదని పిటిషన్ లో ఆళ్ల పేర్కొన్నారు. అయితే, ఈ కేసు విచారణను సెలవుల తర్వాత చేపట్టాలని తెలంగాణ ...

Read More »

రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్… రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మైక్ వీరుడంటూ ఎద్దేవా చేశారు. మైక్ పట్టుకుంటే చాలు పూనకం వచ్చి… ఏది పడితే అది మాట్లాడుతాడన్నారు. భువనగిరి పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్, బీజేపీ వారికి భయపడేది లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని… అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రియ‌ల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటే రియ‌ల్ ఎస్టేట్ ...

Read More »

ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్

ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సాయంత్రం ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీకానున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

Read More »

అడిషనల్ కలెక్టర్ కు అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్.

రైతులను మోసం చేసిన వారిపై జనగామ జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కేసులు పెట్టించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను ఎక్స్ వేదికగా అభినందించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు… వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More »

భువనగిరి ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత మే మొదటి వారంలో మరో బహిరంగ సభను నిర్వహిస్తారు.

Read More »

రాజీవ్ మరణం సంతాపం తెలిపిన సీఎం రేవంత్

సీనీయర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ నేడుగుండెపోటుతో మృతిచెందారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. రాజీవ్ రతన్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా రేవంత్ స్పందిస్తూ… రాజీవ్ రతన్ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన విశిష్టమైన సేవలను అందించారని .. నిజాయతీగా విధులను నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని అంటూ ఆయన మృతి పట్ల ...

Read More »

సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం త‌ప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తున్నారు. ఆయన కొడంగల్‌లో మండలాలవారీగా కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఇందుకోసం ఆయన కొడంగల్ వెళ్తున్న సమయంలో వికారాబాద్ జిల్లా మ‌న్నెగూడ వ‌ద్ద కారు టైర్ పంక్షన్ అయి కారు స‌డెన్‌గా ఆగింది. కాన్వాయ్‌లోని వారికి ఎవరికీ ఏమీ కాకపోవడంతో పోలీసులు ఊపిరి తీసుకున్నారు.

Read More »

CSKవర్సెస్ SRH మ్యాచ్‌లో వెంకీమామతో రేవంత్ రెడ్డి సందడి..

నిన్న ఐపీఎల్ లో CSK వర్సెస్ SRH మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగింది. దీంతో మన తెలుగు క్రికెట్ అభిమానులు భారీగా స్టేడియానికి తరలి వెళ్లారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్లారు. ఇక క్రికెట్ అంటే విక్టరీ వెంకటేష్ ముందుంటాడు. ఏ క్రికెట్ మ్యాచ్ అయినా వెంకటేష్ కి ఖాళీ ఉంటే దేశంలో ఏ స్టేడియంకి అయినా వెళ్లి చూస్తాడు. అయితే నిన్న హైదరాబాద్ లోనే మ్యాచ్ జరుగుతుండటంతో వెంకటేష్ ఉప్పల్ స్టేడియంకి వేలి సందడి చేసాడు. అయితే ...

Read More »

ఢిల్లీకి పయనమైన రేవంత్ రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీకి పయనమయ్యారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ హస్తినకు వెళ్తున్నారు. వాస్తవానికి ఈ సమావేశం నిన్న సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈరోజుకు వాయిదా పడింది.రాష్ట్రంలోని నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈరోజు ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ తో పాటు డిప్యూటీ ...

Read More »