ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

ఎగ్జిట్-పోల్స్-పై-రోజా-ఏమన్నారంటే.jpg

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమరం ముగిసిన నేపథ్యంలో, నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ మంత్రి రోజా స్పందించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయని, ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని వ్యాఖ్యానించారు. 

ఎవరెన్ని చెప్పినా, ఎక్కడ  ఏం మాట్లాడినా… వైఎస్ జగన్ రెండోసారి సీఎం కావడం తథ్యం అని అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి, పాలనలో పారదర్శకత ఉంది కాబట్టే విజయంపై ఇంత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయగలుగుతున్నామని రోజా పేర్కొన్నారు. 

Share this post

scroll to top