గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. స్పాట్‌కు వచ్చిన ఎస్పీ గంగాధర్ మొత్తం సంఘటనా స్ధలాన్ని పరిశీలించకుండానే అక్కడ ఎలాంటి కెమెరాలు లేవనడం పై విద్యార్ధినులు సీరియస్ అయ్యారు. అంతా సర్దుమణిగింది అనుకునే లోపే విద్యార్ధిని, వార్డెన్‌లను పోలీసులు వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయడంతో మరోసారి కళాశాలలో వాతావరణం వేడెక్కింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ అవ్వడమే కాకుండా మంగళవారం లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అయినా విద్యార్ధినులు కళాశాలలో స్ట్రైక్ చేసేటందుకు సిద్ధమవుతుండటంతో ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది.
అయితే, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. నిన్న తాత్కాలికంగా ఆందోళన విరమించిన విద్యార్ధినులు రాత్రికి రాత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్ధినిని తరలించే ప్రయత్నం పోలీసులు, అధికారులు చేయడంతో మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్ధినులు ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు అధికారులు ఈ రోజు మళ్లీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఎంత ఆందోళన చేస్తున్నా ఇంకా ఎటువంటి కెమెరాలు లేవని ప్రచారం చేస్తున్నారంటున్న విద్యార్ధినులు తలిదండ్రులు వస్తేనే ఇళ్ళకు పంపుతామనడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విద్యార్ధినులు మరోవైపు ఈ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి కాలేజి విజిట్ కు వస్తారని, అందుకు తగ్గ ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.