ఐటెం సాంగ్స్ నే నమ్ముకున్న స్టార్ హీరోయిన్..

sriya-3.jpg

శ్రేయ టాలీవుడ్ లో చాలా మంది యంగ్ హీరోస్ స్టార్ హీరోస్ తో కూడా కెరీర్ స్టార్టింగ్ లో చేసేంది. ఒక్క తెలుగేనా తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి స్టార్ తో కూడా చేసింది. కానీ తర్వాత కెరీర్ పరంగా తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఆమెని వెనక్కి లాగేసాయి. వాటిలో మల్లన్న సినిమాలో రోల్ చాలా పెద్ద మిస్టేక్ ని ఆమె చెబుతూ ఉంటుంది. దీనితో అలా హీరోయిన్ గా అవకాశాలు తక్కువే సొంతం చేసుకుంటున్న శ్రేయ పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే. పవన్ తో పులి, వెంకటేష్ తో తులసి ఇలా పలు చిత్రాల్లో ఐటెం గర్ల్ గా శ్రేయ రెచ్చిపోయింది.

అయితే చివరి సారిగా ఒక నటిగా అయితే భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలో పాలు పంచుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఓ సినిమా కోసం ఐటెం భామగా శ్రేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా పలు రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. తమిళంలో హీరో సూర్య నటిస్తున్న తాజా సినిమాకి శ్రేయ స్పెషల్ సాంగ్ కోసం సైన్ చేసిందట. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఆమెని అప్రోచ్ కాగా ఆ సాంగ్ కి ఆమె ఓకే చేసినట్టుగా ఇపుడు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.

Share this post

scroll to top