సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులతో ఉదయం నాలుగు గంటల నుంచే ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. నవగ్రహ యాగం నిర్వహిస్తున్నట్లు సమాచారం. అంతకు ముందు అయిత చండి యాగం, పలుమార్లు రాజశ్యామల యాగాలు కేసీఆర్ చేసిన విషయం తెలిసిందే. ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ప్రతికూల రాజకీయ వాతావరణం, పలు ఇబ్బందుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వినాయక చవితి తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఊరూరా బస్సు యాత్రలు చేస్తారని పార్టీ వర్గాల్లో టాక్. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా వినాయక చవితి, గులాబీ పార్టీ రోజునే విడుదలయ్యే అవకాశం కానుందని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు..
