పోలీసుల అదుపులో అరికెపూడి..

reddy-12.jpg

కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అరికెపూడి గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గాంధీని అక్కడి నుంచి తీసుకెళ్లారు. గాంధీని తీసుకువెళుతున్న పోలీసులను గాంధీ అనుచరులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో ఇరువర్గాల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో గాంధీ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి నా ఇంటికి వస్తా అని రాలేదు కాబట్టే నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చా అన్నారు. దమ్ముంది కాబట్టే కౌశిక్ ఇంటికి వచ్చా అన్నారు. నీ ఇంటికి వచ్చా చూసుకుందా రా కౌశిక్ రెడ్డి అన్నారు గాంధీ. ఉద్రిక్తల మధ్య గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూర్చోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు గాంధీని, ఇరువర్గాల కార్యకర్తల్ని అదుపులో తీసుకున్నారు.

Share this post

scroll to top