సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. గాంధీ కి ఎస్కార్ట్ ఇచ్చి పోలీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను గాంధీ గుండాలతో చంపించే ప్రయత్నం చేశారు పోలీసులు అని ఆరోపించారు. ఎందుకు ఆపలేక పోయారు ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం నన్ను హత్య చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు గుప్పించారు. నన్ను ఇంత దారుణంగా తిడుతున్నారు. మరి గాంధీ మాట్లాడేది భాషేనా అని ప్రశ్నించారు. మా విల్లా లోకి వచ్చి భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. గాంధీ మొఖం చూసి ఓటేయలేదని కేసీఆర్ మొఖం చూసి ఓటేశారని గుర్తు చేశారు. గాంధీ మా ఇంటికి వచ్చి నా వెంట్రుక కూడా టచ్ చేయలేకపోయాడని తెలిపారు.
నా స్థాయికి దిగి వచ్చావు రేవంత్ కి థాంక్స్..
