అక్టోబర్ 3 నుంచి ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలు..

vijayawada-27.jpg

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభయ్యే నవరాత్రి ఉత్సవాలు 12వ తేదీ విజయదశమి వేడుకతో ముగుస్తాయి. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు అలంకార సేవలు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 3న బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారం, 4న గాయత్రీ దేవి అలంకారం, 5న అన్నపూర్ణా దేవి అలంకారం, 6న లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం, 7న మహా చండీ దేవి అలంకారం, 8న మహాలక్ష్మీ దేవి అలంకారం, 9న సరస్వతీ దేవి అలంకారం 10న దుర్గాష్టమి సందర్భంగా దుర్గా దేవి అలంకారం, 11న మహర్నవమి రోజున మహిషాసుర మర్దిని దేవి అలంకారం, 12వ తేదీ విజయదశమి సందర్భంగా ఉదయం మహిషాసుర మర్దిని దేవిగా, సాయంత్రం రాజరాజేశ్వరి దేవిగా అలంకార సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే రోజున సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగనుంది.

Share this post

scroll to top