అన్నమయ్య జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. రాజంపేట వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయన తిరుమలకు వెళ్లడానికి వీలు లేదంటూ నోటీసులు ఇచ్చారు. ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నేతలు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.
ఈ సందర్బంగా ఆకేపాటి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా సెక్షన్-30 పెట్టలేదు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబుది నియంతృత్వ పాలన. చంద్రబాబు ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్య. తిరుమలను రాజకీయానికి వాడుకుంటున్నారు.