బిజీగా ఉండటం ఎలా అని స్పెషల్ క్లాసులు తీసుకోవడానికి ఖాళీ చేసుకోవడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారు త్రిష. అంత బిజీగా ఉన్నారామె. ఒక స్టార్‌తో ఒక సినిమా చేయడానికి హీరోయిన్లు కలలు కంటున్న ఈ సమయంలో ఒకే స్టార్‌తో రెండు మూడు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమె ఫిల్మోగ్రఫీ లిస్టు చూసిన వారికి కళ్లు తిరిగినంత పనవుతోంది. 20 ఏళ్లకు ముందు ఓ అమ్మాయి అందంగా ఉందంటే అది సహజం అనుకోవచ్చు. 20 ఏళ్లుగా అందంగా కనిపిస్తోందంటే మెయింటెనెన్స్ అనుకోవచ్చు. కానీ 20 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల అమ్మాయిలకు కూడా పోటీ ఇస్తోందంటే ఆమె తెచ్చుకున్న వరం అనుకోవాలి. ఆమె చేస్తున్న హార్డ్ వర్క్ అనుకోవాలి అంటూ త్రిష గురించి విజయ్ చెప్పిన మాటలు అక్షర సత్యాలంటున్నారు అభిమానులు.
విజయ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో కనిపిస్తున్నారు త్రిష. జస్ట్ విజయ్‌తోనే కాదు, అజిత్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాల్లోనూ ఆమే నాయిక. విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ పక్కన ఆమె ఎలా ఉంటారోనని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. తమిళంలోనే కాదు మలయాళంలోనూ చేతినిండా సినిమాలున్నాయి సౌత్ క్వీన్ త్రిషకి. పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కాంపౌండ్‌లో చేస్తున్న థగ్‌లైఫ్ కోసం ఆడియన్స్ తో పాటు ఆమె కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఇప్పుడు తన లేటెస్ట్ ప్రాజెక్టుల గురించి కూడా బ్యాక్ టు బ్యాక్ షేర్ చేస్తున్నారు.