తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వలాభం కోసమే తిరుపతి లడ్డూ పై నిందవేశారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. సుప్రీం కోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్ధాలు బయటకు వస్తాయని అన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు దెబ్బ తీశారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు అండ్ కో చేసిన అబద్ధాలు కచ్చితంగా బయటకు వస్తాయన్నారు. సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ ద్వారా విచారణ జరిపితే కచ్చితంగా హిందువుల మనోభావాలను గౌరవించిన, పునరుద్ధరించిన వాళ్లమవుతాం. చంద్రబాబు నాయుడు వేసిన ఈ నిందతో నెయ్యిలో జంతువుల అవశేషాలు కలిశాయా లేదా అనే అనుమానాలతో భక్తులు తిరుమల లడ్డూ తినకుండా వెళ్లిపోతున్నారు. తిరుపతి అమ్మాయిగా చాలా బాధ కలుగుతోంది. అని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
స్వలాభం కోసం చంద్రబాబు లడ్డూ కల్తీ అని ప్రకటన చేశారు..
