పవన్‌కల్యాణ్‌ జోక్యం చేసుకోవాలి..

pavan-kalyan-05.jpg

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సంబంధిత మంత్రిగా జోక్యం చేసుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని కార్మికులు వాపోయారు. గత ప్రభుత్వం నుంచి రావల్సిన బిల్లులు కాంట్రాక్టులకు రాక తమ వేతనాలు నిలుపుదల చేయడంతో నిరసనలు చేస్తున్నామని పేర్నొన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటిపారుదల శాఖను నిర్వహిస్తున్న పవన్‌కల్యాణ్ వెంటనే జోక్యం చేసుకుని వేతనాలు చెల్లించేలా అధికారులతో మాట్లాడాలని కోరారు. తమకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపులను కూడా మానివేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

Share this post

scroll to top