వంట నూనె ధరలు తగ్గింపు..

cbn-11.jpg

ఏపీ ప్రజలకు శుభవార్త ఇవాళ్టి నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఇవాళ్టీ నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రజలకు భారం తగ్గనుంది. పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో వంటనూనె అమ్మకంలో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు సర్కార్. ఈ మేరకు వంట నూనె సప్లయర్లు, డిస్ట్రిబ్యూటర్లను కోరారు మంత్రి నాదెండ్ల. దీంతో సుముఖత వ్యక్తం చేసిన డీలర్లు, సప్లయర్లు పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని నిర్ణయానికి వచ్చారు.

Share this post

scroll to top