నేడు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన..

ktr-25.jpg

రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట చేపట్టింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం జిల్లా కేంద్రంలో పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సెస్ విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ చర్చ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. చర్చ అనంతరం కేటీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరి వస్తారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పార్క్ హయత్ హోటల్‌లో ఒక కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారు.

Share this post

scroll to top