సచివాలయం వద్ద కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళన..

secrateate-25.jpg

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు కుటుంబ సభ్యులు అందోళన చేస్తున్నారు. తమ భర్తలను కూలీలకంటే దారుణంగా చూస్తున్నారని నిరసిస్తూ జిల్లాలోని బెటాలియన్‌ల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాష్ట్ర సచివాలయం వద్దకు బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం తమ భర్తలు ఒకే దగ్గర విధులు నిర్వర్తించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయం ముందు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. బెటాలియన్ కానిస్టేబుల్‌ ల కుంటుంబ సభ్యలును బలవతంగా తరలించడంతో వారు పోలీసులు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Share this post

scroll to top