నేటి నుంచి కార్తీక మాసం..

karthikamasam-02.jpg

నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కార్తీక మాసం శోభ సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం అన్ని మాసాలలోకెల్లా ఉత్తమమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో భక్తులు శివకేశవులను పూజిస్తారు. సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేస్తారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల నమ్మకం. ఈ మాసంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

తెల్లవారుజాము నుంచే నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఈ నెల 4న తొలి కార్తీక సోమవారం రానుంది. కార్తీక సోమవారాల్లో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. కాగా, కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ బాలా త్రిపుర సుందర సమేత సుందరేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగుతోంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

Share this post

scroll to top