పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామిక తెలంగాణలో మరోసారి ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెల్లవారే రోజులొచ్చాయని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులను అడిగితే బెదిరింపులకు పాల్పడుతారని, పోరాడితే సస్పెన్షన్లు చేస్తారని మండిపడ్డారు. ఇది నియంతృత్వ రాజ్యమని, ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తున్నదని చెప్పారు.
మళ్లీ ఎమర్జెన్సీ రోజులు..
