బెంగాల్‌లో తప్పిన భారీ రైలు ప్రమాదం..

trien-09.jpg

పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. సౌత్-ఈస్ట్రన్ రైల్వే ప్రకారం B1 సహా మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రైల్వే సీపీఆర్వో ఓంప్రకాష్ చరణ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్‌-షాలిమార్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు కొన్ని కోచ్‌లు మిడిల్‌ లైన్‌ నుంచి జారి కిందకు వెళ్లాయని తెలిపారు. ఒక పార్శిల్ వ్యాన్, రెండు ప్యాసింజర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే ఎవరికీ తీవ్ర గాయాలైనట్లు సమాచారం లేదు. ప్రయాణీకుల ముందుకు వెళ్లేందుకు 10 బస్సులను ఏర్పాటు చేశారు.

Share this post

scroll to top