అమెరికా తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ నకు భారీ ఊరట లభించింది. ప్రెసిడెంట్ గా రెడీ అవుతున్న టైంలో ఆయనకు సంబంధించిన కేసుల దర్యాప్తును న్యాయమూర్తి నిలిపివేశారు. 2020 నాటి ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన కేసులను ట్రంప్ ని నిందితుడిగా చేర్చారు. కాగా.. ఆ కేసు విచారణను పక్కనబెట్టాలని స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ కోరారు. అందుకు యూఎస్ డిస్ట్రిక్ జడ్జి తాన్య ఛుట్కాన్ అంగీకారం తెలిపారు. పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న అధికారిక చర్యలపై మాజీ అధ్యక్షులకు ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపును ఇచ్చే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే కేసు కొనసాగుతుందని స్మిత్ వాదనలు చేశారు. కాగా.. ఆ వాదనపై ట్రంప్ లాయర్లు నవంబర్ 21 లోపు స్పందించాల్సి ఉంది. ప్రాసిక్యూటర్లు ఎలా ముందుకు వెళ్లాలనే ప్రతిపాదనను డిసెంబర్ 2లోగా న్యాయమూర్తికి తెలియజేస్తారని స్మిత్ చెప్పారు.
ట్రంప్ కు ఎన్నికల హింస కేసులో ఊరట..
