మాజీ సిఎం జగన్ పిటిషన్ పై హై కోర్టు లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫిజికల్ గా జగన్ ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరు కావాల్సిన అవసరం లేదని ఏపి హైకోర్టు స్పష్టం చేసింది. అడ్వకేట్ ప్రజెన్స్స్ సరిపోతుందంటూ లాయర్ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మంత్రి నారాయణ వేసిన పరువు నష్టం దావా క్వాష్ చేయాలంటూ హైకోర్టుకు జగన్ వెళ్లారు. దీంతో ఏపీ హైకోర్టులో జగన్ కు ఊరట లభించింది. ఇక ఈ కేసు వచ్చే నెల 20కు విచారణ వాయిదా వేసింది ఏపి హైకోర్టు. ఇక అటు సుప్రీం కోర్టులో వైఎస్ జగన్ కు ఊరట లభించింది. వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై కీలక ప్రకటన చేసింది సుప్రీం కోర్టు. జగన్ బెయిల్ రద్దుపై విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. తదుపరి విచారణ డిసెంబర్ 2కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.
ఏపీ హైకోర్టు జగన్ కోర్టుకు రావాల్సిన పనిలేదు..
