వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ మధ్యాహ్నాం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన స్పందించనున్నారు. ఈ విషయాన్ని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అయితే సూపర్ సిక్స్ హామీల ఎగవేత, సంక్షేమ లబ్ధిదారులను తగ్గించే లక్ష్యంతో బడ్జెట్ గణాంకాలు ఉన్నాయని వెరసి ఈ బడ్జెట్‌తో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని వైయస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.