ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప-2 ఈ చిత్రం సూపర్ హిట్ పుష్పకు సీక్వెల్‌గా రాబోతుండటంతో మరింత అంచనాలు పెరిగిపోయాయి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమాను బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్తెరకెక్కిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మింస్తున్నారు. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల అవుతోంది. ఇప్పటికే పుష్ప-2 నుంచి విడుదలైన ప్రతి అప్డేట్స్ హైప్ పెంచేశాయి. అంతేకాకుండా భారీ రెస్పాన్స్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రజెంట్ అందరి దృష్టి ట్రైలర్‌పై పడింది. ఎప్పుడెప్పుడు వస్తుందా కాస్తంత స్టోరీ అయినా తెలిసిపోతుందని వెయిట్ చేస్తున్నారు. అయితే ఇటీవల మేకర్స్ నవంబర్ 17న పాట్నాలో గ్రాండ్‌గా ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.