యుద్దంలో పోరాడేందుకు తెలంగాణ బిజేపీకి బలమైన క్యాడరుంది. సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు అవకాశాలూ ఉన్నాయి. గత ఎన్నికల్లో బలమైన ఓటు షేర్ సాధించి తెలంగాణాలో తామే ప్రత్యామ్నాయ పార్టీ అని నేతలు చెబుతున్నారు. మరింత బలోపేతం అవ్వాలని చూస్తున్న ఆ పార్టీకి త్వరలో నూతన అధ్యక్షులు రాబోతున్నారు. తెలంగాణాలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించే కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాషాయ దళపతి అయ్యేందుకు నలుగురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారట. తనకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీని పవర్ లోకి తెస్తానంటూ కేంద్రం పెద్దల వద్ద చెబుతున్నారట అయితే అధిష్టానం మాత్రం సరైన టైమ్ లో సరైన నేతకు పగ్గాలు అప్పగించాలని యోచిస్తోందన్న టాక్ కమలం పార్టీ నుంచి వినిపిస్తోంది.