హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సిద్దిఖీనగర్‌లో ఓ ఐదంతస్థుల భవనం పెద్ద శబ్దాలతో పక్కకు ఒరిగింది. భవనంలో నివసించే వారు శబ్ధాలతో భవనం ఒరుగుతుండడం గమనించి బయటకు పరుగులు తీశారు. భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో నివసించే వారు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల నివసించే వారందరినీ ఇళ్లు ఖాళీ చేయించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన 5 అంతస్థుల భవనం..
