రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. రెండ్రోజుల పాటు నగరంలో పర్యటించనున్న ఆమె షెడ్యూల్ వివరాలను రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 6 గంటలకు ద్రౌపది ముర్ము ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 6.20 గంటల నుంచి 7.10 వరకూ రాజ్ భవన్ లో విశ్రాంతి తీసుకుని 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుకకు హాజరవుతారు.
కోటి దీపోత్సవం ముగిసిన అనంతరం రాజ్ భవన్ కు చేరుకుని అక్కడే రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం 10.20 గంటలకు శిల్పకళావేదికలో లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.