ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ చిత్రాలు మాత్రమే అనుకునే వారు. మరీ ముఖ్యంగా విదేశాల్లో ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే భావనే ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ మాత్రమే కాదని నిరూపిస్తున్నాయి సౌత్ మూవీస్. ఒకప్పుడు హిందీ సినిమాలు దక్షిణాది భాషల్లో విడుదలై మంచి విజయాలను నమోదు చేసుకునేవి. కానీ ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిలో దుమ్మురేపుతున్నాయి. ఆ మాటకొస్తే ఇక్కడితో సమానంగా కలెక్షన్లు రాబడుడుతున్నాయి. బాహుబలితో మొదలైన ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్రాలకు ప్రస్తుతం నేషనల్ వైడ్ గా మార్కెట్ లభిస్తోంది. నార్త్ ఆడియన్స్ కూడా సౌత్ హీరోల చిత్రాలకు ఫిదా అవుతున్నారు.
మొన్నటికి మొన్న అల్లు అర్జున్ పుష్ప2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బిహార్ లో వచ్చిన స్పందనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. బాలీవుడ్ మేకర్స్ కూడా ఇలా బహిరంగ ఈవెంట్స్ నిర్వహించని చోట పుష్ప సరికొత్త అధ్యయనానికి తెర తీసింది. దీంతో రోజురోజుకీ సౌత్ మూవీలపై బాలీవుడ్లో అంచనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వచ్చింది. ఒకప్పడు యాక్షన్, ఛేజింగ్ వంటి మూవీలవైపు ఆసక్తి చూపించే వారు కానీ ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులపై గ్లోబల్ సినిమా ప్రభావం పడుతోంది. కొరియన్ వెబ్ సిరీస్లు మొదలు స్కాండినేవియాకు చెదిన థ్రిల్లర్ సినిమాలను చూస్తున్నారు. దీంతో కథలో వినూత్నత ఉంటేనే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. మూస పద్ధతిలో వచ్చే సినిమాలను నిర్ధాక్షణ్యంగా రిజక్ట్ చేస్తున్నారు.