కిసిక్ సాంగ్ పాడింది వీళ్లే ఏయే భాషలో ఎవరు పాడారంటే..

pushppa-23.jpg

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని మేజర్ సిటీలలో ఈవెంట్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే నవంబర్ 24వ తేదీ అంటే ఈ ఆదివారం నాడు చెన్నైలో ఒక ఈవెంట్ నిర్వహించేందుకు పుష్ప టీం రెడీ అయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే రోజు అదే ప్రాంగణంలో ఈ సినిమాలో ఐటెం సాంగ్ కిస్సిక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో పాటు శ్రీ లీల డ్యాన్స్ చేసింది. వీరిద్దరి డ్యాన్స్ స్టెప్పులు ఒక రేంజ్ లో సెట్ అయ్యాయని టాక్ వినిపిస్తోంది. ఆరోజు ఈ సాంగ్ రిలీజ్ కాబోతూ ఉండడంతో అందరిలో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన అసెట్ గా నిలవబోతోంది అని చెప్తున్నారు.

ఈ సాంగ్ డ్యాన్స్ నెంబర్‌గా వస్తుండడంతో ఈ పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలోనే ఈ పాట హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ పాటను ఎవరు పాడారన్న విషయం పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ‘కిసిక్’ సాంగ్‌ని తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సింగర్ సుభాషిణి పాడగా హిందీలో సుభాషిణి, లోతిక ఝా మలయాళంలో ప్రియా జెర్సన్ బెంగాలీలో ఉజ్జయినీ ముఖర్జీ ఆలపించారు.

Share this post

scroll to top