శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన గంటకే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం ప్రకటించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు, ఆయన అవినీతి అంశాలను రాజ్యసభలో ప్రస్తావించారు. అదానీ అవినీతి బాగోతం యావత్ దేశాన్ని ప్రభావితం చేస్తుందన్నారాయన. అదానీకి ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. అదానీ అంశంపై చర్చించేందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నిరాకరించారు. సాధారణ కార్యకలాపాలకు సహకరించాలని సభ్యుల్ని కోరారు. అందుకు విపక్ష సభ్యులు ససేమిరా అనడంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు.