హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణపై ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రప్రథమంగా పీపీపీ మోడల్ లో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయగలిగాం ప్రపంచంలో చాలా దేశాలతో పాటు మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ సిస్టమ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో విజవంతం కాలేకపోయిందన్నారు. ఇక, మొదటి దఫాలో 69 కిలో మీటర్లలో 57 స్టేషన్లు ఉన్నాయి. అవి మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మధ్య 29 కిలోమీటర్ల ఉంది. అలాగే, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య 11 కి.మీటర్లు నాగోల్ నుంచి రాయదుర్గం మధ్య 29 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. ఇక, ఒకప్పుడు మెట్రో వద్దని నగరంలో అనేక ఆందోళనలు జరిగాయి. కానీ ఇప్పుడు మెట్రో కావాలని అడుగుతున్నారు. నా దిష్టి బొమ్మలు కాల్చిన వారు ఈరోజు సన్మానాలు చేస్తున్నారని నా పుస్తకంలో రాశానని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.