పుష్ప రాజ్ మ్యాజిక్ చేసేశాడు. బాక్సాఫీస్ నయా కింగ్‌గా అవతరించాడు. రపా రప్ కలెక్షన్స్‌ను కుమ్మేస్తున్నాడు. ఇప్పటికే ఎవగ్రీన్ రికార్డ్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్‌ను బద్దలు కొట్టేశాడు. ఇక జక్కన్న డైరెక్షన్లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ అప్పట్లో డే1 223 కోట్లను కలెక్ట్ చేసింది. అయితే ఆ కలెక్షన్స్ కంటే ఎక్కువగా దాదాపు 250 కోట్లను డే1 కొల్లగొట్టాడట పుష్పరాజ్. ఇవి అఫీషియల్ ఫిగర్స్ కానప్పటికీ ఫిల్మ్ అనలిస్టులు మాత్రం గట్టిగా చెబుతున్న మాట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ ముందు వరకు ఈయనో స్టార్ హీరో. పుష్ప రిలీజ్ తర్వాత ఈయనో సూపర్ హీరో. కానీ ఇప్పుడు బాక్సాఫీస్‌నే దడదడలాడించే క్రేజ్‌కే బాప్‌గా మారిన ఐకానిక్ హీరో. ఎస్ ఇప్పటికే రెమ్యునరేషన్లో ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా నిలిచిన బన్నీ ఇప్పుడు పుష్ప2 క్రేయేట్ చేస్తున్న బజ్ తో నేషనల్ వైడ్ వైరల్ అవుతున్నాడు. 80 దేశాల్లో ట్రెండ్ అవుతున్నాడు. ఏకంగా 6 భాష్లలో రీ సౌండ్ చేస్తున్నారు. ఇప్పటికే డే1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌లో కూడా రికార్డ్ క్రియేట్ చేసేశాడు. దీంతో మన ఐకాన్ స్టారే ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ హీరో అంటున్నారు కొంత మంది బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.