తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హైఓల్టేజ్ ను తలపిస్తున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రంపజుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేస్తే దానికి బీఆర్ఎస్ నుంచి వెంటనే కౌంటర్ అటాక్ లు పేలుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ గేమ్ ఛేంజ్ చేసింది. వారి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మళ్లీ చేరికలను ప్రోత్సాహిస్తోంది. బీఆర్ఎస్ దూకుడు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీలో ఉండే బలమైన , సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. తెలంగాణలో జంపింగ్ సీజన్ షురూ అయిందనే కామెంట్స్ కు బలం చేకూర్చేలా బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంది.
మళ్లీ గేమ్ స్టాట్ చేసిన కాంగ్రెస్..
