ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చిన రేవంత్‌ సర్కార్‌..

brs-9.jpg

తెలంగాణ అస్తిత్వంపై రేవంత్‌ సర్కార్‌ దాడిని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని తెలిపారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని విమర్శించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని వెల్లడించారు.

కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బతుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని తెలిపారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని మండిపడ్డారు. బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరమని చెప్పారు. బతుకును ఆగం చేశారని, బతుకమ్మను మాయం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలి అనుకుంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నెలకు రాయాలన్నారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదని చెప్పారు.

Share this post

scroll to top