పోలీస్‌ స్టేషన్ల ఎదుట నిర‌స‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధం..

ysrcp-9.jpg

కూటమి ప్రభుత్వంలో పోలీసుల‌ తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  చట్టం టీడీపీ వారికి ఒకలా, వైయ‌స్ఆర్‌సీపీ వారికి మరోలా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తుండ‌టంతో పోలీస్ స్టేష‌న్ల ఎదుట నిర‌స‌న కార్య‌క్ర‌మాలు తెల‌పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణ‌యించింది.  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, పార్టీ కీల‌క నేత‌ల కుటుంబ సభ్యుల గురించి టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆ పార్టీ శ్రేణులు సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆధారాలతో సహా గత నెల 19న వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదు. దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వానికి ఒకలా, వైయ‌స్ఆర్‌సీపీ వారికి మరోలా వ్యవరిస్తున్నారని, తాము ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై పోలీస్‌ స్టేషన్ల ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ నేతలు నిరసనకు సిద్ధ‌మ‌య్యారు.

Share this post

scroll to top